జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణపురం ఎంపీటీసీ-2 కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన లాల్ స్వామి రాయల్ సోమవారం స్థానిక రామ్‌నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన లాల్ స్వామిని టీసీ వరుణ్ ప్రత్యేకంగా అభినందించారు.
తన విజయానికి కృషి చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు లాల్ స్వామి ఈ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను టీసీ వరుణ్ మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తానని అన్నారు.
అదేవిధంగా నారాయణపురం గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందుబాటులో ఉంటానని లాల్ స్వామి రాయల్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని తెలిపారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్