BREAKING
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక లంబాడిగూడలో,రూ.10 లక్షలతో వీఓ భవన నిర్మాణం… తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్: భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు రంగం సిద్ధం హకీంపేట మెగా రైతు మేళాకు కడ్తాల్ నుంచి 4 బస్సుల్లో రైతులు పెంచికల్ పేట్ ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఏఐఎంసీ జాతీయ కార్యదర్శి బి. అదిత "రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి." విద్యార్థులకు న్యాయం చేయండి సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో వీఓ భవన నిర్మాణం భూమి పూజ జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన రైతు గర్జన సభకు తరలిరావాలి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు - డి. ఎం.పండరి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు...డి. ఎం.పండరి.

చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం! * సిడిపిఓ ఎల్.సుజాత *

Select Suryaa Now
చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం!  * సిడిపిఓ ఎల్.సుజాత *

బాడంగి, సూర్య : చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యంగా బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలకు ‘పోషణ్ భీ పఢాయి భీ’ రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాడంగి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టు సీడీపీఓ ఎల్. సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఎల్ సుజాత మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా చిన్నారుల సమగ్ర అభివృద్ధికి దోహదపడే నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని సీడీపీఓ  తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేసి చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సూచించారు. అనంతరంచిన్నారుల వయస్సుకు అనుగుణంగా వారి శారీరక, మానసిక, మేధో వికాసాన్ని పెంపొందించే బోధనా పద్ధతులపై అంగన్వాడి సూపర్వైజర్లు అయినా ఫెసిల్ టేటర్ ఎస్ కే గౌరమ్మ కో ఫెసిలి టేటర్స్ వై వి నాగమణి ఏ శ్రీదేవి మొదటిరోజు శిక్షణ ఇచ్చారు. మూడు సంవత్సరాలలోపు పిల్లల్లో మెదడు వికాసానికి అవసరమైన తొలిదశ ఉద్దీపన, ఇంట్లో లభించే సాధారణ వస్తువులతో బోధనా ఉపకరణాల తయారీ, ‘నవచేతన’ క్యాలెండర్ వినియోగంపై వివరించారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు ‘ఆధారశిల’ పాఠ్య ప్రణాళిక ఆధారంగా ఆటపాటలతో ఆనందదాయకమైన విద్యను అందించే విధానాలను తెలియజేశారు.
అదేవిధంగా పిల్లల్లో ఎదుగుదల లోపాలు, అభివృద్ధిలో జాప్యాన్ని తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాల ద్వారా వైద్య సేవలు అందేలా చూడటంపై అవగాహన కల్పించారు. పోషణ్ ట్రాకర్ ద్వారా పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, ముఖ గుర్తింపు విధానం, అంగన్వాడీ కేంద్రాల జియో ట్యాగింగ్, గృహ సందర్శనల వివరాల నమోదు వంటి డిజిటల్ సేవల వినియోగంపై ప్రత్యక్ష శిక్షణ అందించారు.