telangana
గుస్సాడి వేడుకల్లో ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య.నేరడిగొండ : ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటిచెబుతున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ దండారి వేడుకల్లో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు యువకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల్లో ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన గుస్సాడి, సంప్రదాయ నృత్యాలను తిలకించారు. డప్పుల మోతలు, ఆటపాటల నడుమ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివాసీలతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తరతరాలుగా కొనసాగుతున్న దండారి ఉత్సవాల గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సంప్రదాయాలను గౌరవిస్తూ, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలను, ఆదివాసీ కళాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు.