BREAKING
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అద్భుత పథకాలు : కడ్తాల్ బ్రాంచ్ మేనేజర్ సువర్చల ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక లంబాడిగూడలో,రూ.10 లక్షలతో వీఓ భవన నిర్మాణం… తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్: భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు రంగం సిద్ధం హకీంపేట మెగా రైతు మేళాకు కడ్తాల్ నుంచి 4 బస్సుల్లో రైతులు పెంచికల్ పేట్ ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఏఐఎంసీ జాతీయ కార్యదర్శి బి. అదిత "రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి." విద్యార్థులకు న్యాయం చేయండి సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో వీఓ భవన నిర్మాణం భూమి పూజ జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన రైతు గర్జన సభకు తరలిరావాలి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు - డి. ఎం.పండరి.

అమల్లోకి వచ్చిన కొత్త ధరలు, రూ.3,540 కోట్లు ఆదా కానున్న వైనం

Select Suryaa Now
అమల్లోకి వచ్చిన కొత్త ధరలు, రూ.3,540 కోట్లు ఆదా కానున్న వైనం

సూర్య బిజినెస్ డెస్క్: ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే కీలకమైన మందుల ధరలు భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చేలా మొత్తం 1,364 యాంటీ-క్యాన్సర్ ఫార్ములేషన్ల సవరించిన గరిష్ట రిటైల్ ధరలు (ఎంఆర్‌పి) సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా దేశంలోని వినియోగదారులకు ప్రతిఏటా సుమారు రూ.3,540.38 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) తీసుకున్న ఈ కీలక నిర్ణయం క్యాన్సర్ మందుల వ్యాపార మార్జిన్లను నియంత్రించడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఎన్‌పీపీఏ 137 రకాల యాంటీ-క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను పరిమితం చేసింది. దీనితో దేశంలోని వివిధ ఫార్మా కంపెనీలు తమ మందుల ధరలను గణనీయంగా తగ్గించాయి.

మొత్తం 85 ఫార్మాస్యూటికల్ కంపెనీలు 121 రకాల ఔషధాలకు సంబంధించి 1,364 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించగా, వీటిలో దాదాపు 679 బ్రాండ్లకు పైగా మందుల ధరలు ఏకంగా 50 శాతానికి పైగా తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాణాలను కాపాడే క్యాన్సర్ మందుల ధరలపై గరిష్టంగా 96.45 శాతం వరకు భారీ తగ్గింపు నమోదు కావడం గమనార్హం.

సామాన్య, మధ్యతరగతి క్యాన్సర్ రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది. సవరించిన ధరల వివరాలను ఫార్మా సఈ దామ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా ఎన్‌పీపీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.