BREAKING
ఒడిశాలో పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు నేరడిగొండ గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత - రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల దీపావళి వేడుకలు: ఒకే వేదికపై నమ్రత, ఉపాసన మరియు స్నేహారెడ్డి సందడి తగ్గిన ముడి చమురు ధరలు, బ్యాంకింగ్ షేర్ల జోరుతో లాభాలతో ముగిసిన సూచీలు టీకాతోనే చిన్నారికి సంపూర్ణ ఆరోగ్య రక్షణ* - చిన్నారుల భవిష్యత్తుకు టీకాలే తొలి భరోసా *డా. ఫణి భూషణ్* కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ కిమ్స్ కడల్స్, కర్నూలు గుస్సాడి వేడుకల్లో ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహితంః టీపీసీసీ అధికార ప్రతినిధి డా. చరణ్ కౌశిక్ ఎన్విడియా పతనంతో భారత ఇన్వెస్టర్లకు షాక్: 50 శాతం ప్రీమియంతో ఈటీఎఫ్ కొనుగోళ్లు ఓటీటీలోకి వచ్చేసిన 'హ్యాపీ జర్నీ' సినిమా: డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే ఢిల్లీలో బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడు మృతి హకీంపేటకు పిహెచ్సి... మల్లంపల్లి మొండి చెయ్యి...! మల్లంపల్లి కి పూర్తిస్థాయిలో పిహెచ్సి మంజూరు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు ప్రశ్నలు సంధించిన లక్ష్మణ్ బాబు, మండలం ఏర్పాటై ఐదేళ్లైనా వైద్యం లేదు... ప్రజలు ఎక్కడికి పోవాలి? బీసీలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలిః ప్రధాని మోదీకి ఆర్‌.కృష్ణయ్య లేఖ బెంగళూరు ప్రాపర్టీ యజమానులకు బీడీఏ బంపర్ ఆఫర్: 4 కీలక నిర్ణయాలు చిట్టమూరులో చింతల సోనియా భారీ మెజార్టీతో విజయం..యువత ఘన సన్మానం! బీసీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కారం ఆసియా నంబర్-1 బీచ్‌గా గోవాలోని పాలోలెం బీచ్: గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానం

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై ..కేటీఆర్‌ ఫైర్‌

Select Suryaa Now
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై ..కేటీఆర్‌ ఫైర్‌

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే పాలనగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదన్నారు. ప్రజల పక్షాన, కార్యకర్తల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే, ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.