BREAKING
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై ..కేటీఆర్‌ ఫైర్‌ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఖేలో ఇండియాలో తెలంగాణ సత్తా చాటాలిః మంత్రి వాకిటి సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక మంత్రి తీవ్ర ఆరోపణలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: ఎంపీ కేశినేని చిన్ని రోడ్డు ప్రమాదంలో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి...ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్

Select Suryaa Now
జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి...ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్

అవనిగడ్డ, మేజర్ న్యూస్ :జర్నలిస్టులపై దాడులను అరికట్టి, విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు తగిన భద్రత కల్పించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈనాడు విలేకరి సుబ్బారావుపై ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సోమవారం అవనిగడ్డ తహసీల్దార్ డి. అంకాలు, డీఎస్పీ రావూరి అభిషేక్‌లకు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నా రవిశంకర్ మాట్లాడుతూ.. కావలిలోని పెదపవని రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దాటిన అనంతరం బైక్‌పై వెళ్తున్న విలేకరి సుబ్బారావును అడ్డగించి దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. గతంలోనూ ఆయనపై దాడికి ప్రయత్నాలు జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మరోసారి దాడి జరగడం జర్నలిస్టుల భద్రతపై ఆందోళన కలిగిస్తోందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన వాగ్వాదానికి ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే పత్రికా రంగం ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనలోని లోటుపాట్లు, అక్రమాలను వెలుగులోకి తెస్తూ సమాజానికి సేవలందిస్తోందన్నారు. అలాంటి జర్నలిస్టులపై దాడులు చేయడం, బెదిరించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని పేర్కొన్నారు.

జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక జర్నలిస్టుల దాడుల నివారణ కమిటీ (జర్నలిస్ట్స్ అటాక్ ప్రివెన్షన్ కమిటీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు రక్షణ కల్పించడంతో పాటు, దాడులకు గురైన వారికి న్యాయ, వైద్య సహాయం అందించాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజకీయ, సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రాలను ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అలపర్తి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకే శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కుంపటి బాబురావు, కోశాధికారి మోపిదేవి అమ్మయ్య, జర్నలిస్టులు ఇమ్మిడిశెట్టి వెంకట్, సామర్ల మల్లికార్జునరావు, కంచర్లపల్లి వెంకట నాంచారయ్య, కైతేపల్లి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.