andhrapradesh
స్థానిక ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీయే కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయం సాధించిందని, 2024 సార్వత్రిక ఎన్నికల కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు, వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయని గుర్తుచేసిన సీఎం, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం 58.9 శాతానికి పెరిగిందని, అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం 33.56 శాతానికి పడిపోయిందని వివరించారు.
ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. గతంలో ఈవీఎంలను మేనేజ్ చేశారని ఆరోపించినవారు, ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపినా రిగ్గింగ్ చేశారంటున్నారని మండిపడ్డారు. ఇది బ్యాలెట్ ద్వారా ప్రజలు కూటమికి అందించిన నిజమైన విజయమని, ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానాలని చంద్రబాబు హితవు పలికారు.