telangana
రోడ్డు ప్రమాదంలో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై కాలేజీకి వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఉస్మానియా యూనివర్సిటీ (OU) మైనింగ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థిని షేక్ ఆయేషా (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.