BREAKING
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై రాష్ట్రస్థాయి సమీక్ష అనుమతి లేని కోకాను తొలగించండి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ఎంపీపీలు, జెడ్పీటీసీల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ* ఇంకుడు గుంతలను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి ప్రభుత్వ పథకాలలో దళారులను నమ్మవద్దు - ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంకా ఏం అనుకోలేదు చిత్రానికి మేఘాలు సంద్రంలో మెలోడీ సాంగ్ లాంచ్.. డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్! ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గించేందుకు ఫీల్డ్ ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించాలి ఈ నెల 21వ తేదీలోగా ఇన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి - అదనపు కలెక్టర్ విక్టర్ బెజ్జూర్ ఎస్సైని శాలువాతో సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులు గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి - రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్‌కు ఘన నివాళులు.. కన్నీటి పర్యంతమైన మలయాళ చిత్ర పరిశ్రమ! పంటల సాగులో సేంద్రియ పద్ధతులను పాటించాలి - రైతులకు సహాయ వ్యవసాయ సంచాలకురాలు రాధిక సూచన

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన

Select Suryaa Now
యంగ్ ఇండియా  ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పరిశీలన


* పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
* నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశం
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలం రాయిచేడ్ గ్రామ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పాఠశాలలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే వెంట  రాయిచెడు సర్పంచ్ తోళ్ళ లలిత ఆనంద్ అధికారులు పాల్గొన్నారు.