వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై రాష్ట్రస్థాయి సమీక్ష
• మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి
• బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు చర్యలు
• ప్రతి మంగళవారం జిల్లా వైద్యాధికారులతో సమీక్ష
సూర్య, మంచిర్యాల: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రోగ్రాం డైరెక్టర్లతో మంగళవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. ప్రతి మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సమీక్షలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, గర్భిణులకు నిర్వహించే వైద్య పరీక్షలు, టీకాల కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన అన్ని రకాల టీకాలను అందుబాటులో ఉంచి అర్హులైన వారందరికీ అందించాలని సూచించారు.
అదేవిధంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల బాధితులను ముందస్తుగా గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందజేయాలని ఆదేశించారు. జీవనశైలి మార్పులతో వచ్చే వ్యాధులు, సంక్రమిత వ్యాధులు, కీటక జనిత వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. టెలి మానస్, ఈ-ఔషధి, ఈ-సంజీవని, మీ ప్రాణం కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారికి అవసరమైన పోషకాహార కిట్లు అందజేయడం, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపరచడం, కుక్కకాటు, పాముకాటు బాధితులకు తక్షణ చికిత్స అందించడం, క్రిటికల్ కేర్ సేవలు, వ్యాక్సినేషన్ సదుపాయాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.
మీ ప్రాణం కార్యక్రమంలో భాగంగా సిబ్బంది హాజరు నమోదు, వైద్య శిబిరాల నిర్వహణ, లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన వివరాల నమోదు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చించారు. కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా ఆరోగ్య బృందం సభ్యులు ఆర్.ఎస్. పద్మ, కాకిరాల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఫార్మసీ అధికారులు శ్రీనివాస్, సంబంధిత ప్రోగ్రాం అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.