ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించాలి
శృంగవరపుకోట, సూర్య : పట్టణంలోని ఆర్టీసీ డిపో సమస్యలను పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం డిపో గేటు వద్ద ఆర్టీసీ సిబ్బంది ఎర్ర బాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు కే కోటేశ్వరరావు మాట్లాడుతూ. ఆర్నాబ్ తుఫాను వల్ల అరుకు రూట్ లో ఘాటీ రోడ్డు పాడయినందున ఆ రూట్ వెళ్లే బస్సులను బొబ్బిలి, అనకాపల్లి, విశాఖ, రాజం రూట్ లలో తిప్పుతున్నారని అందువలన మన డిపో పరిధిలో రూట్లో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారని కావున డిపో పరిధిలో రూట్లలోనే బస్సులను నడపాలని అన్నారు. అదేవిధంగా డిపో సమస్యలను పలుమార్లు జేఏసీ తరఫున విన్నవించినప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని ఎర్రబ్యాడ్జీలతో డిపో గేటు ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె. కృష్ణారావు, ఏ. రాజయ్య, జీ.వి. రమణ, కే. జి. నాయుడు డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.