BREAKING
అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి

అధికార బలానికి ఎదురొడ్డి.. సర్వేపల్లి లో ఉనికిని చాటుకున్న వైఎస్ఆర్సిపి...

Select Suryaa Now
అధికార బలానికి ఎదురొడ్డి.. సర్వేపల్లి లో ఉనికిని చాటుకున్న వైఎస్ఆర్సిపి...

సర్వేపల్లి,  మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. అధికార పార్టీ నుంచి ఎదురైన రాజకీయ ఒత్తిళ్లు, అడ్డంకులు, వివిధ సవాళ్ల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. అధికార బలం, రాజకీయ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మూడో వంతు ఎంపీటీసీ స్థానాలను సాధించడం ద్వారా వైఎస్సార్‌సీపీ తన పట్టును నిలబెట్టుకుంది.మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ, నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికల ప్రచారం, పోలింగ్ వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేశారు.అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు.ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణల సమయంలో కొన్ని చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రమ కేసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలపై పార్టీ నాయకులు అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేయడంతో పాటు న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమయ్యారు.ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికల బరిలో నిలిపారు. ఆయన రాజకీయ వ్యూహాలు, నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నియోజకవర్గంలోని పలు ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు.ఒకవైపు అధికార పార్టీ తన రాజకీయ బలాన్ని ఉపయోగిస్తోందన్న విమర్శలు, మరోవైపు వైఎస్సార్‌సీపీకి ఎదురైన ఎన్నికల సవాళ్ల మధ్య వెలువడిన ఫలితాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ అతడే ఒక సైన్యంగా కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలోమూడో వంతు స్థానాలను గెలిపించుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.మొత్తంగా సర్వేపల్లి నియోజకవర్గ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుసరించిన రాజకీయ వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, అభ్యర్థుల పోరాటం వైఎస్సార్‌సీపీ సాధించిన స్థానాల వెనుక కీలకంగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.