BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన

Select Suryaa Now
విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి..  కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి..  కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణ, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌బీ, బీసీవై విద్యార్థి విభాగం నాయకులు అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ, బీసీవై విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో ఆహార కలుషిత ఘటనలు, రాప్తాడు ఘటన, కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి భవనం నుంచి కిందపడిన ఘటనలు విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
కేఎస్‌ఎన్ కళాశాల ఘటనపై యాజమాన్యం, ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి విద్యాసంస్థల్లో భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కోరారు. మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించాలని, అధికారుల పర్యవేక్షణ పెంచాలని విజ్ఞప్తి చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..