BREAKING
సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు! ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! రాహుల్ రీలాంచ్ కోసమే ప్రజాధనం దుర్వినియోగం! ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం పీట్ హెగ్‌సెత్‌పై ఇంపీచ్‌మెంట్ పిటిషన్: అమెరికాలో రాజకీయ దుమారం బాలయ్య బాబులో నాన్నను చూసుకుంటున్నా.. నందమూరి హీరోతో ప్రత్యేక బంధంపై ఎమోషనల్ అయిన తమన్! భూ వివాదాలు శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణంలో గిన్నిస్ రికార్డ్: ముచ్చింతల్‌లో భక్తిపారవశ్యం నెస్లిన్ భవిష్యత్తులో పెద్ద సూపర్‌స్టార్ అవుతాడు.. సూర్య సినిమాపై అట్లీ ప్రశంసల జల్లు! ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్!

ఏఐసీ–ఎస్కేయూలో ఆహార శుద్ధి, విలువ జోడింపు కేంద్రం ప్రారంభం..

Select Suryaa Now
ఏఐసీ–ఎస్కేయూలో ఆహార శుద్ధి, విలువ జోడింపు కేంద్రం ప్రారంభం..

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఏఐసీ–ఎస్కేయూ సమాఖ్య, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన, సాంకేతిక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఆహార శుద్ధి, విలువ జోడింపు కేంద్రం మంగళవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతికుమార్, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. జేఎన్‌టీయూ కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి, ఉప ప్రధానాచార్యులు ప్రొఫెసర్ బి. దిలీప్ కుమార్, ఆచార్యులు మమత, లలిత పాల్గొన్నారు.
ఈ కేంద్రం ద్వారా రైతులు, ఆహార రంగ పారిశ్రామికవేత్తలు, నూతన వ్యాపార సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆహార శుద్ధి సాంకేతికతలు, విలువ జోడించిన ఆహార ఉత్పత్తుల తయారీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహకారం అందించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించి మార్కెట్లో మెరుగైన అవకాశాలు పొందేందుకు ఈ కేంద్రం దోహదపడనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, స్థానిక ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, రైతులు, పరిశ్రమల మధ్య సమన్వయంతో గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించవచ్చని ప్రముఖులు పేర్కొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..