శ్రీజ తండ్రి యాదగిరి రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల...
ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్...
ధైర్యంగా ఉండాలని సూచన..
శ్రీజ తండ్రితో మాట్లాడి వివరాలను తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల
కన్వెల్ మేజర్ న్యూస్: మండలంలోని షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయా యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కూతురు శ్రీజ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి ఈ నెల రెండున అదృశ్యమవడం విధితమే.. కాదా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి యాదగిరిరెడ్డి రూపా దంపతులను శబ్దుల్లాపురంలోని వారి ఇంటి వద్ద మంగళవారం కలిసి పరామర్శించారు. అనంతరం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి డిపి కేటీఆర్ ను ఫోన్ ద్వారా యాదగిరి రెడ్డితో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పిజ్జా ఆచూకీ కోసం అక్కడున్న వారితో మాట్లాడుతానని యాదగిరి రెడ్డికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య గౌడ్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం బాషా, శేఖర్ రెడ్డి, కడారి కృష్ణయ్య, దండంపల్లి సత్తయ్య, రావుల శ్రీనివాస్ రెడ్డి, సుంకి రెడ్డి వెంకటరెడ్డి, అంతకుముందు మారేపల్లి గౌరారం మాజీ సర్పంచ్ గోన ఎల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఎల్లమ్మ కుమారుడు జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోన రవీందర్రావును పరామర్శించారు.