BREAKING
అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి

21న సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం

Select Suryaa Now
21న  సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం

అరసవల్లి, సూర్య : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హంస నావికోత్సవాన్ని (తెప్పోత్సవం) ఈ నెల 21వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న ఇంద్రపుష్కరిణిలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ వేడుకను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. తెప్పోత్సవం సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి దేవేరులతో సహా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హంసనావపై కొలువుదీర్చి పుష్కరిణిలో భక్తుల దర్శనార్థం ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విశేషాలను ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించాలని కోరారు.