BREAKING
జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన

ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం - సుమైరాకు కాంస్య పతకం

Select Suryaa Now
ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం  - సుమైరాకు కాంస్య పతకం

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:

న్యూఢిల్లీలో నిర్వహించిన 70వ జాతీయ పాఠశాల క్రీడా పోటీల్లో అండర్-17 టెన్నిస్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున చిత్తూరుకు చెందిన ఆర్.కే. విద్యాలయ విద్యార్థిని సుమైరా అన్సారీ సయ్యద్ లక్ష్యత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించడం గర్వకారణమని ఆర్.కే. విద్యాలయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి ఈ ఘనత సాధించడం అభినందనీయమని, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ఆర్.కే. విద్యా సంస్థలు నిరంతరం ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ సుమైరా సాధించిన విజయం పాఠశాలకే కాదు, చిత్తూరు జిల్లాకే గర్వకారణమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని తమ సంస్థ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. సుమైరా క్రమశిక్షణ, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల యాజమాన్యం తరపున ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పతకాన్ని అందుకున్న విద్యార్థినిని కళాశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కల్పజ అభినందించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్