ఎల్లమ్మ ఆలయంలో కార్తీక పూజలు.. శ్రీ సర్వమంగళ దేవిగా ఎల్లమ్మ దర్శనం...
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని ధరేశ్వ పురం స్టేజి వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయంలో కార్తీకమాస పూజలు ప్రారంభమైనవి. కార్తిక తొలి మంగళ వారం ను పురస్కరించుకొని అమ్మవారు శ్రీ సర్వ మంగళ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఉదయం ఆలయ ముఖ్య అర్చకులు అమ్మవారికి నిజాభిషేక పూజలను జరిపారు. శ్రీదేవి ఖడ్గ నామావళి విధానంలో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల రద్దీ కనుగుణంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.