andhrapradesh
సింగరకొండకు తెదేపా శ్రేణుల పాదయాత్ర.
ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా కూటమి శ్రేణులు అత్యుత్సాహంతో, భక్తిభావంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ కాకాని అశోక్ నేతృత్వంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, మహిళలు కాకానిపాలెం నుండి సింగరకొండకు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు కాకానిపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి సింగరకొండ పుణ్యక్షేత్రం వరకు శ్రేణులంతా కలిసి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకొని స్వామివారిని దర్శించుకున్నారు.