మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు
మెలియాపుట్టి, సూర్య : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మెలియాపుట్టి మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరించేందుకు పది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పి. నరసింహప్రసాద్ మంగళవారం తెలిపారు. గ్రామాల వారీగా కేంద్రాలను కేటాయించారు.
* గొప్పిలి జెడ్పీ హైస్కూల్: గొప్పిలి, గోకర్ణపురం, సంతలక్ష్మీపురం.
* కరజాడ జెడ్పీ హైస్కూల్: కరజాడ, భరణికోట, మర్రిపాడు-కె, ఎస్. కొలిగాం, ముక్తాపురం.
* జాడుపల్లి గ్రామ సచివాలయం: జాడుపల్లి, చీపురుపల్లి, పరశురాంపురం, బాణాపురం.
* చాపర జెడ్పీ హైస్కూల్: మారడికోట, చాపర, జోడూరు, పట్టుపురం.
* పెద్దలక్ష్మీపురం జెడ్పీ హైస్కూల్: పెద్దలక్ష్మీపురం, శేఖరాపురం, గంగరాజుపురం.
* కోసమాల జెడ్పీ హైస్కూల్: కోసమాల, వసుంధర, నడసంద్ర, రట్టిని.
* మర్రిపాడు-సి ఎంపీపీ స్కూల్: మర్రిపాడు-సి, దీనబంధుపురం, కొత్తూరు, వెంకటాపురం.
* పెద్దపద్మాపురం జెడ్పీ హైస్కూల్: పెద్దపద్మాపురం, పడ్డ, ముకుందాపురం.
* కేరాసింగి జీఏటీడబ్ల్యూయూపీ స్కూల్: కేరాసింగి, ఆంపురం, గొట్టిపల్లి, ఇల్లాయిపురం.
* మెలియాపుట్టి ఎంపీపీ స్కూల్: మెలియాపుట్టి, సిరియాఖండి, సుందరాడ.
ఈ పది కేంద్రాలకు అధికారులను నియమించామని, వారి ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎంపీడీవో వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.