BREAKING
భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం!

మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? 15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి 12 స్థానాలు

Select Suryaa Now
మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా?  15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి 12 స్థానాలు

మెలియాపుట్టి, సూర్య : మెలియాపుట్టి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎంపీపీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోనుండగా, అధ్యక్ష పదవికి మర్రిపాడు-సి ఎంపీటీసీగా విజయం సాధించిన బైరసింగి దినకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఎంపీపీ బాధ్యతలు అప్పగించాలని కూటమి నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైస్ ఎంపీపీ పదవికి కోసమాల ఎంపీటీసీగా గెలుపొందిన సలాన రోహిణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెలియాపుట్టి మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్‌సీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 12 స్థానాలకు చేరింది. ఈ ఫలితాలు మండల పరిషత్‌పై కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు ఎవరిని వరించనున్నాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు కోడలు సలాన రోహిణికి వైస్ ఎంపీపీ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక, రాజకీయ సమీకరణాలతో పాటు పార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పదవుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మండలంలో స్పష్టమైన మెజార్టీ సాధించిన కూటమి నేతలు పదవుల పంపకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బైరసింగి దినకర్, సలాన రోహిణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో మెలియాపుట్టి మండల రాజకీయాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.