బయ్యారంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ
బయ్యారం, మేజర్ న్యూస్, బయ్యారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ స్వాముల మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు దాదాపు 35 మంది భక్తులకు హనుమాన్ మాలలు ధరింపజేసి దీక్షను ప్రారంభించారు.మాలాధారణ కార్యక్రమంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.భక్తుల రామనామ స్మరణలు,హనుమాన్ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.భక్తి పారవశ్యంతో సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో గురుస్వాములు దారావత్ నాగు స్వామి,నరేష్ స్వామితో పాటు పలువురు హనుమాన్ స్వాములు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: స్వామి ,బయ్యారం, మహబూబాద్ జిల్లా