*1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన మల్లి వెంకటరమణమ్మకు మాజీ మంత్రి నల్లపరెడ్డి అభినందనలు...
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన శ్రీమతి మల్లి వెంకటరమణమ్మ గారు నేడు నెల్లూరులోని మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లి వెంకటరమణమ్మ గారిని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు శాలువాతో సన్మానించి, అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ షాహుల్, చెర్లో సతీష్ రెడ్డి, షేక్ షకీలా బేగం, యనమల మోహన్, మల్లి శ్రీకాంత్, బెల్లంకొండ రాజా, గుంజి భరత్, గుంజి భాస్కర్, వల్లపు శ్రీనివాసులు, వల్లపు రవి, బెల్లంకొండ ప్రకాష్, రాపూరు పుట్టయ్య, తన్నీరు శ్రీనివాసులు, వల్లపు వినోష్, బెల్లంకొండ శ్రీనివాసులు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.