చిలుకూరు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అన్న దానం
చిలుకూరు మేజర్ న్యూస్ : నవంబర్ నెలలో రెండవ వారము. రోజున 10-11-26 న కార్తీక మాసం లో మొదటి మంగళవారం సందర్భంగా చిలుకూరు కాల్వొడ్డు శ్రీ అభయాంజనేయ స్వామి వారి కి ఉదయం ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజలు నిర్వహించారు. ఆలయం అర్చకులు రజనీ కాంత్ ఆచార్య వారి ఆధ్వర్యంలో స్వామి వారి కి ప్రత్యేక అభిషేకాలు ,ఆకు పూజలు. నిర్వహించారు. మంగళవారం అన్నదానం చేయించిన దాతలు ఈరోజు మంగళవారం సందర్భంగా అన్నదానం చేయించిన దాతలు రామచంద్రా నగర్ , వాస్తవ్యులు శ్రీ బుడిగెం వెంకయ్య లక్ష్మీ. వారి కుమారుడు శ్రీ బుడిగెం రమేష్ అరుణ దంపతులు, కుమార్తె ప్రజ్ణ, నీహారిక, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం ప్రసాదం భక్తులందరికీ అందజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయం ఛైర్మన్ శ్రీ కొడారు వెంకటేశ్వర్లు, చంద్రయ్య, సమ్మిరెడ్డి,శ్రీనివాస్ , లక్ష్మయ్య,, వీరభద్రం, గోపయ్య ,తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాదం తయారు చేసిన వారు. రోజా భవానీ మంగమ్మ , పద్మ , లావణ్య, తదితరులు ఉన్నారు , ఆలయం సంప్రదాయం ప్రకారం అన్నదాతలకు కు అర్చకులు శ్రీమాన్ చించాపట్నం రజనీ కాంత్ ఆచార్య స్వామి వారి మెమెంటో తో సన్మానం చేసి ఆశీస్సులు అందించారు.