BREAKING
ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

పవన్ కళ్యాణ్ ఆశయాలు… పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు

Select Suryaa Now
పవన్ కళ్యాణ్  ఆశయాలు… పొంగూరు నారాయణ  మార్గదర్శకత్వంలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు

నెల్లూరు సిటీ, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గునుకుల విజయలక్ష్మి ని సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ… జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆకాంక్షించిన రాజకీయ జవాబుదారీతనం, పారదర్శకమైన పాలన, ప్రజలకు నేరుగా సేవలందించే నూతన రాజకీయ సంస్కృతికి అనుగుణంగా, పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో సచివాలయ వ్యవస్థ ఎంతో నైపుణ్యంతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గతంలో కూడా సచివాలయ సిబ్బంది సహకారంతో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన గునుకుల విజయలక్ష్మి కి అభినందనలు తెలియజేయడంతో పాటు, భవిష్యత్తులో మరింత సమన్వయంతో ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో సిబ్బంది ఆమెను కలిశారని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలతో సచివాలయానికి వచ్చినప్పుడు వారితో ఓపికగా, ప్రేమగా, గౌరవంగా వ్యవహరించాలని, చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. మనమందించే చిన్న సేవ కూడా ఒక కుటుంబ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. మంత్రి  పొంగూరు నారాయణ  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో సచివాలయ సిబ్బందికి పూర్తి సహకారం అందిస్తానని, ప్రతి విభాగంలోనూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని విజయలక్ష్మి గునుకుల తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్,తెలుగుదేశం నాయకులు చండ్రా మదు పాల్గొన్నారు.