వ్యసనాలకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉండాలి
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సమాజంలో రుగ్మతలు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో మాదిగ విద్యార్థులు ఏ వ్యసనాలకు లోనుకాకుండా , వ్యసనాలకు దూరంగా, విజ్ఞానానికి దగ్గరగా ఉండి జీవితాలను అద్భుతంగా మలచుకోవాలని డా.గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండల కేంద్రంలో మాదిగ విద్యార్థుల సదస్సు కోడెపాక రాజు మాదిగ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ " నిర్జీవమైన జంతువుల చర్మాన్ని ఒలిచి దాన్ని శుద్ధి చేసి దాని ద్వారా చెప్పులను, డప్పులను,సంచులను, వ్యవసాయ పరికరాలను తయారు చేసిన మొట్ట మొదటి శాస్త్రీయ విజ్ఞానవంతులు మాదిగలే అని అన్నారు.మన పూర్వీకుల నుండి శాస్త్రీయ విజ్ఞానాన్ని వారసత్వంగా అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు .అలాగే ఉన్నత విద్యావంతులుగా మాదిగ కులంలో ఉన్న పేదరికం వెనుకబాటుతనం నిరక్షరాస్యత వివక్షతలను తొలగించుకోవడానికి బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తన జీవితాన్ని ధారపోసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సాధించాడని, దాని ద్వారా 9% రిజర్వేషన్లు మాదిగలకు లభించాయని అన్నారు. ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకొని విద్యా ఉద్యోగాల్లో రాణించాలని కోరారు. అలాగే మహనీయులు కలలు కన్న కుల వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు పాటు పడాలని కోరారు.అందుకోసం ప్రతి మాదిగ విద్యార్థి ఎం ఎస్ ఎఫ్ లో చేరి మహనీయుల ఆశయాల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఎం ఎస్ ఎఫ్ మండల కమిటీ అధ్యక్షులు మాదాసి భాను ప్రసాద్ అధికార ప్రతినిధి నమిండ్ల జీవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మాదాసి వరుణ్ తేజ్, కొయ్యడ సన్షీర్, ఉపాధ్యక్షుడు కుక్కముడి ఫ్రిడ్జ్, మాదాసి తరుణ్, జినుక భరత్, కోశాధికారి తనుగుల సంపత్ , కార్యదర్శులు పరికి శ్రీశాంత్, మాదాసి సూర్యవంశీ, వారికి సిద్ధార్థ, మాదాశి వర్షిత్, సహాయ కార్యదర్శులు చిరుపల్లి చరణ్, మాదాసి లోకేష్, మాదాసి సంతోష్, కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి బొచ్చు తిరుపతి మాదిగ ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జి నద్దునూరి రఘు మాదిగ కో కన్వీనర్ సుధాకర్ మాదిగ అనిల్ మాదిగ రాజు మాదిగ మహేష్ మాదిగ మరియు మాదిగ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా