రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి
గార్ల, మేజర్ న్యూస్, అరుగలం శ్రమించి పలు రకాల పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయం పై విధిగా అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు. మంగళవారం మండల పరిధి శేరిపురం గ్రామ పంచాయతీ కేంద్రంలోని రైతు వేదికలో అక్కడి సర్పంచ్ గుగులోత్ భారతి అధ్యక్షతన జరిగిన రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల పై రైతులకు అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం పై విధిగా అవగాహన కలిగి ఉండాలని, ప్రకృతి వ్యవసాయంతో భూ సారం మెరుగవుతుందన్నారు. పర్యావరణం రక్షించ పడుతుందని, ఆరోగ్యాకరమైన పంటలు పండుతాయన్నారు. దీంతో నేల సారవంతం అవుతుందని, నేలలో సేంద్రియ కార్బనం మెరుగుపడి పంటలకు అనుకూలంగా మారుతుందన్నారు. రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడోద్దన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులిన జీవామృతం, ఘన జీవామృతంగా దశ పర్ణి కషాయం మొదలైన పదార్ధాలు వాడి నేలను పర్యావరణం ను సంరక్షించాలని ఆయన కోరారు. అనంతరం జీవామృతం ఘన జీవామృతం తయారీ, వాటిని పిచికారీ పై వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ కల్పించినారు. ఈ కార్యక్రమంలో ఎఈవో రాజ్య లక్ష్మి, ఇరిగేష్ ఎఈ భరత్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్: నాగేశ్వరరావు ,గార్ల, మహబూబాద్ జిల్లా