BREAKING
రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి నాయుడుపేట బైపాస్‌లో నెత్తుటేరులు.. మహిళ దుర్మరణం! ఐదేళ్ల గరిష్టానికి ఢిల్లీ వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఏఐసీ–ఎస్కేయూలో ఆహార శుద్ధి, విలువ జోడింపు కేంద్రం ప్రారంభం.. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి వద్ద బిటిపి కాలువలో పడ్డ ట్రాక్టర్.

ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి

Select Suryaa Now
ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి

బయ్యారం, మేజర్ న్యూస్, ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని సుందరయ్య స్తూపం వద్ద తెలంగాణ రైతు సంఘం 36 జెండాలను సీనియర్ కామ్రేడ్ మెరుగు వెంకన్న ఎగురవేశారు.
అనంతరం మంకెన తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు మండా రాజన్న,తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నంబూరు మధు మాట్లాడుతూ రైతాంగ హక్కుల సాధన వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని,వ్యవసాయ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని,కరువు ప్రాంతాల్లో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాదాబైనామా భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని,కౌలు రైతులను గుర్తించాలని కోరారు.ఈ నెల 15న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగిరేకుల నాగేశ్వరరావు,వల్లాల వెంకన్న,వెన్ను మోహన్,కత్తి రమేష్,నాగేష్,అప్పయ్య,యాకూబ్,ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: స్వామి ,బయ్యారం, మహబూబాద్ జిల్లా