BREAKING
పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి!

నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.....

Select Suryaa Now
నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.....

విజయనగరం, సూర్య : నగరంలో సంపూర్ణ పారిశుధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ బాలస్వామి ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పారిశుధ్య పనితీరును గమనించారు. సేకరించిన చెత్తలను ఎప్పటికప్పుడు చెత్త తరలించే వాహనాల్లో డంపింగ్ యార్డ్ కు చేరే విధంగా చూడాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ శతశాతం అమలయ్యే విధంగా చూడాలన్నారు. నిర్ణీత సమయానికి పారిశుధ్య కార్మికులు విధులకు హాజరవుతున్నారా లేదా అని గమనించారు. వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కాలువలలో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. రహదారులపై నీరు నిలవ లేకుండా చూడాలన్నారు. అనంతరం అన్నక్యాంటీన్ ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న ఆహారం పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుచికి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్ల ఔన్నత్యాన్ని మరింతగా పెంచే విధంగా సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.