BREAKING
భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం!

20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు

Select Suryaa Now
20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు

సంతబొమ్మాళి, సూర్య : సంతబొమ్మాళి మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మరోసారి స్పష్టమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలనూ కైవసం చేసుకున్న టీడీపీ బలపరిచిన అభ్యర్థులు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. గోపికృష్ణ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులపై ఘనవిజయం సాధించి అన్ని స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేశారు. ఈ విజయంతో మండల పరిషత్‌పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులకు అధికారికంగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలిపారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సంతబొమ్మాళి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నూతన ఎంపీటీసీ సభ్యులంతా సమష్టిగా కృషి చేస్తారని స్పష్టం చేశారు.
20 స్థానాలు ఏకపక్ష విజయం అభివృద్ధే లక్ష్యంగా నూతన ఎంపీటీసీల అడుగులు పడుతుండటంతో మండల రాజకీయాల్లో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.