నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం
ఆత్మకూరు, మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ చెరువులోని నీటిని అక్రమ వాడకం చేయడంతో చెరువులోని నీరు తగ్గిపోయి ఎండిపోతున్నదని నీరుకుళ్ళ పెంచికల్ పేట తదితర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ళ గ్రామ పెద్ద చెరువు నీరుకుళ్ళ గ్రామం తో పాటు నల్లబెల్లి మండలం రేలకుంట నందిగామ దుగ్గొండి మండలాలకు సైతం విస్తరించి ఉన్నది. ఎలినినో పరిస్థితుల మధ్య భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చెరువు నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా చెరువు నీటిలో అక్రమ వాడకాన్ని కొంతమంది కొనసాగిస్తున్నారు నల్లబెల్లి మండలం రేలకుంట నందిగామ పరిధిలోని వ్యవసాయ భూముల్లో అక్రమంగా మొక్కజొన్న వేరుశనగ వంటి పంటలు వేసి పదుల సంఖ్యలో చైనా మోటార్ల తో 24 గంటలపాటు నీరుకుళ్ళ చెరువులోని నీటిని తోడి ఆ పంటలకు ఉపయోగిస్తున్నారని నీరుకుళ్ళ గ్రామ రైతులు ఆరోపించారు. వందలాది ఎకరాల్లో ఈ వ్యవసాయ పంటలకు చెరువు నీటిని ఎగువ భాగానికి తోడి వేస్తుండడం పట్ల చెరువు నీరు ఎండిపోయి భూగర్భ జలాలు అడగంటి పోయే ప్రమాదం ఫోన్చి ఉన్నదని నీరుకుళ్ళ గ్రామస్తులు రైతులు ఆందోళన వెలి బుచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం వేసవిలో నీరుకుళ్ళ చెరువు నీరుకుళ్ళ కటాక్షపూరు పెంచికల్ పేట తదితర గ్రామాల నుండి పశువులకు గొర్రెలకు మేకలకు తాగునీరు అందిస్తున్నది. ఈ సంవత్సరం ఎల్ ని నో పరిస్థితుల మధ్య చెరువు నీరు అంతంతమాత్రంగా ఉన్నదని గ్రామస్తులు వివరించారు అక్రమంగా మోటర్లు పెట్టి 24 గంటలు చెరువు నీటిని తోడేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని నీరుకుళ్ళ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు
అక్రమ వాడకాన్ని అరికట్టేందుకు అధికారులు స్పందించాలి నల్ల బెల్లి మండలం రేలకుంట నందిగామ గ్రామాల పరిసరాలలో అక్రమంగా వేసిన మొక్క జొన్న వేరుశనగ తదితర పంటలకు అనధికారికంగా వందలాది మోటార్లతో చెరువు నీటిని అక్రమంగా వాడకాన్ని అరికట్టాలని నీరుకుళ్ళ గ్రామ రైతులు ఆత్మకూరు నల్లబెల్లి మండలాల తహసిల్దారులను కోరారు. పంటలు వేయవద్దని ప్రభుత్వము అధికారులు చెప్పిన వినకుండా పంటలు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు చెరువు ఎగువ ప్రాంతాలను ఆత్మకూరు నల్లబెల్లి రెవెన్యూ అధికారులు సందర్శించి చెరువులోని నీటి అక్రమ వాడకం అరికట్టాలని వారు కోరారు.
చెరువులోనీ అక్రమ నీటి వాడకాన్ని అరికట్టకపోతే వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లను సంప్రదించి పరిస్థితిని వివరిస్తామని నీరుకుళ్ళ గ్రామ రైతులు వివరించారు
రిపోర్టర్; శ్రీనివాస్, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా