BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు! ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! రాహుల్ రీలాంచ్ కోసమే ప్రజాధనం దుర్వినియోగం! ఓపెన్ స్కూల్ పై అవగాహన కార్యక్రమం పీట్ హెగ్‌సెత్‌పై ఇంపీచ్‌మెంట్ పిటిషన్: అమెరికాలో రాజకీయ దుమారం బాలయ్య బాబులో నాన్నను చూసుకుంటున్నా.. నందమూరి హీరోతో ప్రత్యేక బంధంపై ఎమోషనల్ అయిన తమన్! భూ వివాదాలు శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణంలో గిన్నిస్ రికార్డ్: ముచ్చింతల్‌లో భక్తిపారవశ్యం నెస్లిన్ భవిష్యత్తులో పెద్ద సూపర్‌స్టార్ అవుతాడు.. సూర్య సినిమాపై అట్లీ ప్రశంసల జల్లు! ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు

సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

పలాస, సూర్య : రాబోయే సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని,ప్రతి గ్రామంలో కూడా వైసిపి జెండా ఎగరాలని, వజ్రపుకొత్తూరు క్యాడర్ కు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజ దిశానిర్దేశం చేసారు. స్థానిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ప్రగతి భవన్ లో మంగళవారం వజ్రపుకొత్తూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.

రాబోయే సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమాయత్తం కావాలని, భవిష్యత్తులో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు అందరూ సమిష్టిగా సిద్ధం కావాలని సూచించారు.

గత ఎన్నికల అనుభవాలపై చర్చ.

ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడ బలంగా ఉన్నామనే అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగాలి.

రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అప్పలరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలో గళమెత్తాలని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగించాలని సూచించారు. ఎన్ని రాజకీయ అవరోధాలు ఎదురైనా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మాజీ వైస్ జడ్పీ చైర్మన్ పాలిన శ్రావణి శ్రీనివాస్,పార్టీ అధ్యక్షులు తిర్రి రాజారావు, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, నాయకులు తమ్మినేని శాంతారావు, కర్న శ్రీను, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.