BREAKING
20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..... సింగరకొండకు తెదేపా శ్రేణుల పాదయాత్ర. *1వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన మల్లి వెంకటరమణమ్మకు మాజీ మంత్రి నల్లపరెడ్డి అభినందనలు... మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు ఆర్.కే. విద్యాలయానికి జాతీయ గౌరవం - సుమైరాకు కాంస్య పతకం "కాకాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు" ఎల్లమ్మ ఆలయంలో కార్తీక పూజలు.. శ్రీ సర్వమంగళ దేవిగా ఎల్లమ్మ దర్శనం... మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? 15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి 12 స్థానాలు అధికార బలానికి ఎదురొడ్డి.. సర్వేపల్లి లో ఉనికిని చాటుకున్న వైఎస్ఆర్సిపి... చిలుకూరు అభయ ఆంజనేయస్వామి ఆలయంలో అన్న దానం పాము కాటుకి గురైన వ్యక్తి మృతి 21న సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవం శ్రీజ తండ్రి యాదగిరి రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల... సీజనల్ వ్యాధులకు హోమియోపతిలో ప్రత్యేక మందులు డా కరుణాకర్

విద్యాశాఖ హామీలన్నీ గాలికే-బత్తిని శ్రీనివాస్ గౌడ్

Select Suryaa Now
విద్యాశాఖ హామీలన్నీ గాలికే-బత్తిని శ్రీనివాస్ గౌడ్

ఖానాపూర్, మేజర్ న్యూస్, విద్యా శాఖను ఉద్ధరిస్తానని తమ వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖకు కేటాయించిన నిధులు ఎంత? ఇచ్చిన హామీలు ఏమిటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్యా శాఖకు 2024లో 21,292 కోట్లు, 2025లో 23,108 కోట్లు, 2026లో 26,674 కోట్లు మొత్తం 71,074 కోట్లు కేటాయించారని ఆ నిధులు ఎలా ఖర్చు చేశారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నుండి ఇప్పటి వరకు ఇచ్చిన 12 హామీల్లో అభయహస్తం యువ వికాసం, 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ఐఐటి, జెఇఇ, నీట్ ఉచిత శిక్షణ కేంద్రాలు, నెలకు 4000 నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీ, 65 ఐటిఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడం, ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల భవనాల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీలకు కేజీ టు పీజీ ఉచిత విద్య, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, పబ్లిక్ స్కూల్స్ ను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దడం, ఉన్నత విద్య అభ్యసించిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు లక్ష నుండి 5 లక్షల వరకు ప్రోత్సాహకాలు వంటి హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చేసిన అబద్ధపు హామీలేనని మూడేళ్లు గడుస్తున్నా ఒక్క పథకం కూడా కార్యరూపం దాల్చలేదని ఇది కాంగ్రెస్ గారడీ అని విమర్శించారు.

రిపోర్టర్; అనిల్ కుమార్ ,ఖానాపూర్ వరంగల్ జిల్లా,