చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – సైన్స్ సంబరాలు 2026 పోస్టర్‌ను మంగళవారం ముల్కనూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు దాసరి రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రామంచ బిక్షపతి మాట్లాడుతూ నవంబర్ 12న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్, రామకృష్ణ ,భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా