నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు బారీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు 75 వేల రూపాయల స్కాలర్ షిప్ ను మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బారీ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలువాలనే ఉద్దేశ్యంతో జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 75 మంది నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఇమ్రాన్, అజీమ్ రాహి, పట్వారి సాజీద్, పట్వారి ముజాహిద్, ఇర్ఫాన్, నసీం, ఆసిమ్, ఇర్షాద్, రెహాన్, షేన్నా, షజ్జీ ఫెరోజ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.