సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారికి తుది జాబితాలో పేరు చేర్చుకునేందుకు మరో అవకాశం
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో అదనపు జిల్లా వి. విక్టర్ మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాలు జారీ చేసినప్పటికీ గైర్హాజరు కావడం, నివాసం మారడం తదితర కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ఓటర్లు తమ పేర్లను తుది ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్ఓలు), ఎన్నికల నమోదు అధికారులను (ఈఆర్ఓలు) సంప్రదించి నిర్దేశించిన విధానంలో ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు.ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ నెల 21.11.2026 లోపు దరఖాస్తులను సమర్పించి ఓటరు జాబితాలో తమ పేర్ల నమోదును నిర్ధారించుకోవాలని అదనపు జిల్లా ఎన్నికల అధికారి కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.