ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌కు ఘన సన్మానం..
.
సూర్య - పెద్దపల్లి: పెద్దపల్లి ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాకం ఓం ప్రకాష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ రియల్ ఎస్టేట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి పుష్పమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ ప్రజలకు, రిజిస్ట్రేషన్ సేవలు పొందే వారికి అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందించాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ రియల్ ఎస్టేట్ సభ్యులు దేవనంది సదయ్య, బొల్లు శ్రీనివాస్, బండారి రవి, కావటి సమ్మయ్య, వోడ్నాల రమేష్ , ఉప్పు సతీష్, డాక్యుమెంట్ రైటర్ బాకం దీపు తదితరులు పాల్గొన్నారు.