BREAKING
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై ..కేటీఆర్‌ ఫైర్‌ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఖేలో ఇండియాలో తెలంగాణ సత్తా చాటాలిః మంత్రి వాకిటి సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కూతురు మృతి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక మంత్రి తీవ్ర ఆరోపణలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం: ఎంపీ కేశినేని చిన్ని రోడ్డు ప్రమాదంలో ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి ఫెర్టిలిటీ కేంద్రాలకు మహిళా కమిషన్ నోటీసులు టీడీపీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ ఎడ్లూరి ప్రభాకరరావు దంపతుల సేవాభినందనీయం – డాక్టర్ చలపతి చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి రూ.1.30 లక్షల విలువైన వైద్య పరికరాల వితరణ సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

భగవద్గీతతో జీవిత సత్యాలను తెలుసుకోవాలి..

Select Suryaa Now
భగవద్గీతతో జీవిత సత్యాలను తెలుసుకోవాలి..

అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:-ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి జీవిత సత్యాలను తెలుసుకోవాలని నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్. నిర్మలమురళి సూచించారు. భగవద్గీతను రెండోసారి చదివి పూర్తి చేసిన సందర్భంగా, దీపావళి పండుగను పురస్కరించుకుని కోవూరు నగర్‌లోని ఏయిమ్ ఫర్ సేవ శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మలమురళి మాట్లాడుతూ.. భగవద్గీతలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలు, విలువలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే భగవద్గీతను చదివి అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టాలని కోరారు. భగవద్గీత పఠనం ఎంతోమంది జీవితాల్లో సానుకూల మార్పులకు కారణమైందన్నారు..కార్యక్రమంలో స్వామి సత్యాత్మనంద, మేనేజర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున, నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్