మసీదులు ఆధ్యాత్మిక శాంతికి నిలయాలు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా సమాజంలో శాంతి, సోదరభావం, సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న అన్నారు.సోమవారం నందవరం మండలం ముగతి గ్రామంలో నూతనంగా నిర్మించిన మస్జిద్-ఏ-రజియా కరీం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకుడు హాజీ అబ్దుల్ కరీంను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదెన్న మాట్లాడుతూ మసీదులు దైవభక్తి, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో ప్రార్థనలు చేసే వేదికలని తెలిపారు. ఇవి సమాజంలో ఐక్యత, సోదరభావం, సమానత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రదినిది ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా