అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిరంతరం కొనసాగుతున్న నిత్య అన్నదాన పథకానికి భక్తులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు.
విజయవాడ పటమటకు చెందిన పులగం లీల రాజీవ్, డొంక రోడ్డు, పడమటకు చెందిన వారు ఈ విరాళాన్ని అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్ట్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి, తీర్థప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.