ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అభినందనలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అభినందనలు
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ మండలాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) విజయం సాధించిన అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా