andhrapradesh
13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం: మత్స్యకారులకు హెచ్చరికలు
అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్లడించారు. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే వీలుందని అధికారులు పేర్కొన్నారు.
దీని ప్రభావంతో అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతాల్లో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉండే అవకాశముంది.