BREAKING
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులకు శిక్షణ జలసంరక్షణ పనులకు పెద్దపీట వేయాలి - జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ ఆత్మకూరు ఎంపీపి రేసులో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు జడ్పిటిసి సిరమ్మకు అభినందనలు వెల్లువ.... నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి ఎన్నికల్లో ఓటమి ఎరుగని బషీర్ కుటుంబం మున్సిపాలకులు కొలువు తీరేది 23న - చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా ప్రమాణ స్వీకారం రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.కోటి విరాళం బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు నాణ్యమైన విద్యాబోధనే మా లక్ష్యం కార్పొరేషన్ ఆదాయానికి గండి దృష్టి పెట్టని అధికారులు ఈ ప్రాంతంలో ప్రక్షాళన ఎప్పుడో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా

కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Select Suryaa Now
కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,మేజర్ న్యూస్:కరువును జాతీయ విపత్తుగా గుర్తించి, రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం 
సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు తహసిల్దార్ కార్యాలయం ముందు  రైతులతో కలిసి మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథులుగా హాజరై  మాట్లాడుతూ
ఎల్ నినో- ముసురు తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరారు. కౌలు తీసుకున్న రైతులకు నష్టపరిహారం కరువు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .రాష్ట్రంలో వర్షాలు లేక ఎలినోవా ప్రభావంతో సరిపడా వర్షాలు కురువక రైతులు వేసిన అన్ని రకాల పంటలు పూర్తిగా నష్టపోయారని అవేదన వ్యక్తం చేశారు.గతంలో పత్తి ఎకరాకు 10 క్వింటాల నుండి 15 కింటాలు దిగుబడి వచ్చేదని ఈ సంవత్సరం ఎకరాకు కింటల్ నుండి రెండు కింటాలే వచ్చిందని,వరి రైతులు పూర్తిగా నష్టపోయారని అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరువును జాతీయ విపత్తుగా గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు .వరి రైతులకు ఎకరాకు 30000 పత్తి వాణిజ్య పంట రైతులకు 50,000 రూపాయలు ఇవ్వాలని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేసి మునుగోడు, దేవరకొండ నియోజవర్గాలకు  నీరు అందించాలన్నారు.డిమాండ్ చేశారు అనంతరం ఎమ్మార్వో కువినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సీపీఐ  నాయకులు పాల్గొన్నారు.

కె ఇంద్రసేనారెడ్డి, మేజర్ న్యూస్, మునుగోడు నల్గొండ జిల్లా .