BREAKING
జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్ మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..!

వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా

Select Suryaa Now
వైసీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా

విజయవాడ, ఉదయం ప్రతినిధి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో ఏర్పాటు చేయనున్న నూతన రాజకీయ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదని, అధికారిక సభ్యత్వాలు, పార్టీ పదవుల విషయంలోనూ సరైన విధానం లేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అంతర్గత కోవర్టు రాజకీయాలే కారణమని పేర్కొన్నారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు, గుంటూరులో కూటమి అభ్యర్థుల విజయానికి వైసీపీలోని కొందరు నాయకులే పరోక్షంగా సహకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో కొనసాగినంతకాలం వైసీపీ మనుగడ కష్టమని విమర్శిస్తూ, పార్టీ అంతర్గత పరిస్థితులపై జగన్ ఇప్పటికైనా దృష్టి సారించాలని సూచించారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.