BREAKING
మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి నాయుడుపేట బైపాస్‌లో నెత్తుటేరులు.. మహిళ దుర్మరణం! ఐదేళ్ల గరిష్టానికి ఢిల్లీ వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి

చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్

Select Suryaa Now
చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్

లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, లింగాలఘణపూర్ మండలం చిటూర్ గ్రామంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను గ్రామ సర్పంచ్ బర్ల గణేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల వంటశాలను పరిశీలించి, ఆహార పదార్థాల నిల్వలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.అనంతరం విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నిత్యం నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించాలని వంట నిర్వాహకులకు స్పష్టం చేశారు. భోజనం తయారీలో పరిశుభ్రత పాటించడంతో పాటు ఎలాంటి అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చిలుపురం మంజుల, రవి, మబ్బు రేఖ, కొడిశాల అనిత, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;గన్ను కార్తీక్ ,లింగాల గణపురం, జనగామ జిల్లా