BREAKING
మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం: ఎగసిపడ్డ మంటలు రామాయణం స్వీడన్ ప్రీమియర్‌లో భావోద్వేగం.. జటాయు పాత్రకు ప్రశంసలు దక్కడంపై అనుపమ్ ఖేర్ హర్షం! విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి.. కేఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి.. కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి సంఘాల వినూత్న నిరసన ఇంకా ఏం అనుకోలేదు చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది.. నిర్మాత వంశీ నందిపాటి! ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడి నాయుడుపేట బైపాస్‌లో నెత్తుటేరులు.. మహిళ దుర్మరణం! ఐదేళ్ల గరిష్టానికి ఢిల్లీ వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి

జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల.

Select Suryaa Now
జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: 
చిత్తూరు రూరల్ మండలం జడ్పీటీసీగా విజయం సాధించిన మంజుల శశికర్ బాబును మంగళవారం చిత్తూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. జడ్పీటీసీగా విజయం సాధించిన మంజుల శశికర్ బాబుకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మోహన్ రాజ్ మాట్లాడుతూ మంజుల శశికర్ బాబు విజయం చిత్తూరు రూరల్ మండలంలో కూటమికి లభించిన ప్రజాదరణకు నిదర్శనమని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్మి ఓటు వేశారన్నారు. మండలంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి జడ్పీటీసీగా ఆమె కృషి చేస్తారని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తేనే ఇలాంటి విజయాలు సాధ్యమని చెప్పారు. మంజుల శశికర్ బాబుకు పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంజుల శశికర్ బాబు మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిశానిర్దేశంలో మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ,చిత్తూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గువ్వకల్లు కందసామి, నాయకులు రజిని, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్