మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన
మునగాల, మేజర్ న్యూస్ : మోడల్ స్కూల్ మునగాల విద్యార్థులను మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు మంగళవారం అభినందించారు.
గత నెలలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ గేమ్స్ లో సెకండ్ ప్లేస్ గెలిచిన టీంను, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యార్థి ఎం. సాహితిని ప్రత్యేకంగా అభినందించారు.
మోడల్ స్కూల్ మునగాల నుండి విద్యార్థులు చదువుతో పాటు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు అన్నారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. వీరబాబు, ఇంచార్జి ప్రిన్సిపల్ జె. రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.