చికిత్స పొందుతూ ఒకరు మృతి
రామభద్రపురం, సూర్య : మండల పరిధిలోని కొట్టక్కి గ్రామంలో పురుగు మందు తాగి ఒక వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ వాన్న జ్ఞానప్రసాద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన అదే గ్రామానికి చెందిన గొల్లి సింహాచలం (42) పురుగుల మందు తాగాడని, అక్కడ నుంచి సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యంకోసం విజయనగరం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు తెలిపారు. మృతుని భార్య గొల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.