BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

గిరిజన రైతులకు వాణిజ్య పుట్టగొడుగుల సాగుపై శిక్షణా కార్యక్రమం

Select Suryaa Now
గిరిజన రైతులకు వాణిజ్య పుట్టగొడుగుల సాగుపై శిక్షణా కార్యక్రమం

గరుగుబిల్లి, సూర్య : పార్వతీపురం ఐసీఏఆర్ గిరిజన ఉప ప్రణాళిక 2025–26 కార్యక్రమంలో భాగంగా డాక్టర్ వై. ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన కళాశాల, పార్వతీపురం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గిరిజన రైతులకు వాణిజ్య పుట్టగొడుగుల ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ ఎన్. ఝాన్సీరాణి, సహాయ ఆచార్యులు (వృక్ష రోగ శాస్త్రం), రైతులకు వాణిజ్య ప్రాధాన్యత కలిగిన పుట్టగొడుగుల సాగు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. బటన్, ఆయిస్టర్, పాడి స్ట్రా వంటి వివిధ రకాల పుట్టగొడుగుల సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు, అవసరమైన ముడి పదార్థాలు, కంపోస్టు తయారీ, విత్తనం (స్పాన్) ఎంపిక, సాగు పద్ధతులు, కోత మరియు నిల్వ వంటి అంశాలను గురించి తెలియజేశారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడి తో పుట్టగొడుగుల సాగు చేపట్టి అదనపు ఆదాయం పొందే అవకాశా లను వివరించారు. అదే విధంగా పుట్టగొడుగుల, ఆయిస్టర్ విత్తనాలను గిరిజన రైతులకు అందజేశారు. ఈసందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్. రాజ్యలక్ష్మి, ప్రాజెక్టు సహ పరిశోధకులు డాక్టర్ పి. ప్రదీప్ కుమార్, సహాయ ఆచార్యులు (ఉద్యానశాస్త్రం), డాక్టర్ బి. సుజాత, సహాయ ఆచార్యులు (కీటక శాస్త్రం) పాల్గొని ప్రసంగించారు. పుట్టగొడుగుల సాగు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. తక్కువ స్థలంలో, స్థానికంగా లభించే వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకొని పుట్టగొడుగులను ఉత్పత్తి చేయవచ్చని, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. గిరిజన రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మహిళలు మరియు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గిరిజన కుటుంబాల పోషకాహార భద్రతను పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలి పారు. ఈ సందర్భంగా పుట్టగొడుగుల పెంపకంపై అవసరమైన కరపత్రాలను రైతులకు అందజేశారు.