BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

జేఎన్‌టీయూఏలో ఐదు రోజుల అధ్యాపక శిక్షణ.. ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల గావించిన ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

Select Suryaa Now
జేఎన్‌టీయూఏలో ఐదు రోజుల అధ్యాపక శిక్షణ..  ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల గావించిన ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు

అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో, విశ్వవిద్యాలయ అధ్యాపక అభివృద్ధి, మహిళా సాధికారత విభాగం సహకారంతో ‘మోకు: గో అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్’ అంశంపై ఐదు రోజుల అధ్యాపక శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నవంబర్ 14 వరకు కొనసాగనుంది.
కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి  ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అధ్యాపకులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. డిజిటల్ సాధనాలను వినియోగించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు.
గౌరవ అతిథి ప్రొఫెసర్ పి. చెన్నా రెడ్డి ఆధునిక బోధనా విధానాల ప్రాధాన్యతను వివరించగా, ప్రొఫెసర్ డి. వివేకానంద పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో ప్రాయోగిక నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్. అరుణ మస్తానీ మాట్లాడుతూ.. అధ్యాపకుల వృత్తిపరమైన అభివృద్ధి, బోధనా ప్రమాణాల పెంపు ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. సమన్వయకర్త డాక్టర్ డి. లలిత కుమారి ఐదు రోజుల శిక్షణలో నిర్వహించే సాంకేతిక అంశాలను వివరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, జేఎన్‌టీయూఏ అనుబంధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ శిక్షణ అధ్యాపకుల బోధనా సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్ విద్యలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..